ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 20 : సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో జనవరి 17 నుంచి 26వ తేదీ వరకు స్థానిక కైలాస్నగర్లోని అశోక్ బుద్ధవిహార్లో నిర్వహించనున్న శ్రామ్నర్-సైనిక్ శిక్షణ శిబిరం విజయవంతం చేసేందుకు అన్ని మండలాల్లో బైక్ ర్యాలీ తీస్తున్న జిల్లా సంఘటకులు మార్షల్ విశ్వభుషన్ వాఘ్మారే తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద బౌద్ధ భిక్షువు పుజ్య బంతే బుద్ధ ఘెష్, సమతా సైనిక్ దళ్ దక్షిణ భారత సంఘ టకులు మార్షల్ దీపక్ వాఘ్మారే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, బైక్ ర్యాలీ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ రాష్ట్ర సంఘటకులు మార్షల్ రవిచంద్ర జాబాడె, శీలానంద్ కాంబ్లే, హర్షవర్ధన్ వాఘ్మారే, సత్యపాల్ వాఘ్మారే, రోహన్ బోధి కదం, రమాకాంత్ కాంబ్లే, శుభం, ధనశ్రీ వాఘ్మారే, ఆశ్వీని, తక్షశీలా పాల్గొన్నారు.
ఇంద్రవెల్లికి చేరిన ర్యాలీ..
ఇంద్రవెల్లి, డిసెంబర్ 20 : జిల్లా కేంద్రంలో ప్రారంభించిన ప్రచార యాత్ర ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చేరుకున్నది. ఈ సందర్భంగా రాష్ట్ర ట్రైనింగ్ ఆఫీసర్ సత్యపాల్ వాగ్మారే, రాష్ట్ర కన్వీనర్ వర్షవర్ధన్ అంబేద్కర్ విగ్రహానికి ఫూలమాల వేసి, నివాళులర్పించారు. ఆయా గ్రామాల్లో సమతా సైనిక్ దళ్ శిక్షణ శిబిరంపై ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు తదితరులు పాల్గొన్నారు.