ఎదులాపురం, డిసెంబర్ 11: ఏళ్లుగా శ్రమ దోపిడీకి గురవుతున్న సమగ్ర శిక్ష సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం జిల్లా కేంద్రంలో వినూత్న నిరసన తెలిపారు. సమ్మెలో భాగం గా దీక్షా శిబిరం నుంచి ఎన్టీఆర్ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అకడ నోటికి గుడ్డ లు కట్టుకుని మౌన దీక్ష చేపట్టారు.
డీఈవో కార్యాలయ సిబ్బంది ఉద్యోగులను భయాభ్రాంతులకు గురి చేయడం మానుకోవాలన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నా తమ సమస్యల పరిషారంపై ఊసే లేదన్నారు. ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గణేశ్ మద్దతు ప్రకటన చేశారు.ఎస్ఎస్ఏ నాయకులు, వినోద్, ప్రకాశ్, కేశవ్, పార్థసారథి, వెంకటి, శ్రీకాంత్, రాజన్న, సురేశ్, భీజన్న, దీప్తి, మల్లిక, ప్రియాంక, దశరథ, సలీం, సందీప్, సురేందర్ పాల్గొన్నారు.