మంచిర్యాల, సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన కందికట్ల సహస్ర బ్యాడ్మింటన్‌లో రాణిస్తూ సంచలనాలు సృష్టిస్తోంది. బ్యాడ్మింటన్‌పై ఇష్టంతో 8 ఏళ్ల ప్రాయంలోనే ప్రాక్టిస్ మొదలుపెట్టింది. కుమార్తె ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు మధుకుమార్-స్రవంతి ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లల గోపిచంద్ శిష్యుల్లో ఒకరైనా నేషనల్ ప్లేయర్ వికాస్ హర్ష దగ్గర కోచించ్ ఇప్పించారు. నాచారంలోని ఎంకేఎస్ బ్యాడ్మింటన్ అకాడమీలో 2020 నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్న సహస్ర జాతీ య స్థాయిలో సత్తా చాటుతోంది. 11 ఏళ్ల వ యసులోనే అండర్-13 జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైంది.
అండర్-11లో యోనెన్స్ సన్‌రైజ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్, పీఎన్బీ మెట్‌లైఫ్ జూనియర్ బ్యా డ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. గతేడాది 2023 లో జరిగిన ఆలిండియా ఓపెన్ టోర్మమెంట్ గెలుచుకొని, గోల్డ్ మెడల్ సాధించింది. అనంతరం నిర్వహించిన యూవీ ఛాంపియన్షిప్ ఓపెన్‌లో సిల్వర్, నమ్మ బ్యాడ్మింటన్ ఓపెన్ టోర్నమెంట్, పీఎస్ఎం జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లలో గోల్డ్ మెడల్స్ గెలుచుకుంది.
ఇటీవల పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పోటీల కోసం నిర్వహించిన టోర్నమెంట్లో పాల్గొని సత్తా చాటింది. అండర్-13లో జాతీ య స్థాయిలో 20 ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. నేటి నుంచి (సెప్టెంబర్ 13) నుంచి 19వ తేదీ వరకు కోల్‌కతాలో జరిగే నేషనల్స్‌లో పాల్గొననున్నది. దేశవ్యాప్తంగా టాప్-25 మందికి ఎంట్రీ కల్పించగా, ఇందులో సహస్ర ఒకరు. దేశవ్యాప్తంగా సుమారు 500 మంది క్రీడాకారులు పాల్గొనే ఈ టోర్నీలో సత్తా చాటేందుకు సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో జిల్లా బ్యాడ్మింటన్ క్రీడాకారుల అసోసియేషన్ సభ్యులు సహస్ర ఈ మెగా టోర్నీలో రాణించాలని ఆకాంక్షిస్తున్నారు.