మంచిర్యాల అర్బన్, జనవరి 17: బ్యాంకు లు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలని, ప్రతి ఏటీఎం వద్ద తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డును నియమించాలని, సీసీ కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేసుకోవాలని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నా రు. శుక్రవారం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ ఏసీపీలు, వివిధ బ్యాంకుల అధికారులతో సమావేశం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ బ్యాంకు అధికారులు, పోలీస్ అధికారులతో సమన్వయం తో పనిచేస్తేనే నేరాలను నియంత్రించవచ్చన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ లో 109 బ్యాంకులు, 79 ఏటీఎంలు, మంచిర్యాల జోన్ పరిధిలో109 బ్యాంకులు, 89 ఏటీఎంలు ఉన్నాయని, బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతా ప్రమాణాలు తప్పక పాటించాలని సూచించారు. ఏదైనా ఘటన జరిగితే డయల్ 100కు, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
తప్పుడు అఫిడవిట్ సమర్పిస్తే చర్యలు
తమపై ఎలాంటి కేసులు లేవని కొంతమంది తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తున్నారని, అ లాంటి వారిపై చర్యలు తప్పవని సీపీ శ్రీనివా స్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మంచిర్యాల జోన్ పరిధిలో పాస్పోర్ట్ కోసం, ఉద్యో గ నియామకాల కోసం, బయట దేశాలకు వెళ్లడం కోసం, తదితర కంపెనీ, సంస్థలు, పరిశ్రమల్లో పనిచేయడం కోసం పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్(పీవీసీ), పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) కోసం దరఖాస్తులు చేసుకునేవారిలో కొందరు తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తున్నారని, కొంతమందిని గుర్తించి కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.