బెల్లంపల్లి : రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి ( Coal Production) సాధించాలని బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎం రఘుకుమార్( GM Raghukumar ) , ఏరియా సేఫ్టీ అధికారి రవీందర్ కార్మికులకు సూచించారు. శనివారం బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గని ఆవరణలో కార్మికులకు నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. గనిలో ప్రమాదాలు చోటు చేసుకోకుండా విధులు ఎలా నిర్వర్తించాలో వారికి సమగ్రంగా వివరించారు. రక్షణ సూత్రాలు ఎలా పాటించాలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా, అధికారులు నాగవర్ధన్, బసవరాజు, పి.రాజు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.