ఎదులాపురం, మే16 : ఆర్టీసీలో అద్దెబస్సు డ్రైవర్ల పోస్టులకు తమను ఎంపిక చేసి శిక్షణకు పంపించకుండా రెండు నెలలుగా ఇబ్బంది పెట్టడం పై శుక్రవారం ఆర్టీసీ రిజియన్ వ్యాప్తంగా డ్రైవర్లు ఆర్ఎం కార్యాల యానికి చేరుకొని నిరసన తెలిపారు. అంతకు ముందు ఆర్ఎంను కలి సి సమస్యను విన్నవించారు. ఈ సందర్భంగా డ్రైవర్ సతీశ్ మాట్లా డుతూ మార్చి నెలలో ఎంప్లాయిమెంట్ కార్యాలయం నుంచి తమకు ఆర్టీసీలో హైర్ బస్సు డ్రైవర్ల భర్తీకి కాల్ వచ్చిందన్నారు.
తాము ఇం టర్వ్యూలు, డ్రైవింగ్ టెస్టులో ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. మార్చి 18న హకీం పేటలో ట్రైనింగ్ ఉంటుందని సిద్ధంగా ఉండాలని ఎంపి కైన 70 మందికి తెలియజేశారన్నారు. ట్రైనింగ్‌కు పిలుస్తారెమోనని రెండు నెలలుగా ఖాళీగా ఉంటున్నామని, దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్‌కు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.