ఆర్టీసీ బస్సు టైర్ రాడ్ విరిగి..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంలో ఓ ఆర్టీసీ బస్సు రన్నింగ్‌లో ఉండగా ఒక్కసారిగా వీల్రాడ్డు విరిగింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
- డ్రైవర్ చాకచక్యంతో తృటిలో తప్పిన ప్రమాదం
- ప్రమాద సమయంలో 55 మంది ప్రమాణికులు
చింతలమానేపల్లి, ఫిబ్రవరి 3: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంలో ఓ ఆర్టీసీ బస్సు రన్నింగ్‌లో ఉండగా ఒక్కసారిగా వీల్రాడ్డు విరిగింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని కర్జెల్లి, గూడెం ప్రధాన రహదారిపై శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ29జడ్2076) మహారాష్ట్రలోని అహెరికి వెళ్లి తిరిగి డిపోకు వస్తోంది. కర్జెల్లి దాటిన తర్వాత ఒక్కసారిగా బస్ స్టీరింగ్‌కు అనుసంధానంగా ఉండే వీల్ రాడ్డు విరిగి పోయింది. దీంతో అదుపుతప్పి రోడ్డు పక్కకు దిగింది. బస్సులో ప్రయాణిస్తున్న 55 మంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కానీ డ్రైవర్ ప్రభాకర్ చాకచక్యంగా బస్సును కంట్రోల్ చేసి బస్సును నిలిపివేశాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
New Districts | కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు.. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల దశాబ్ది వేడుక
Harish Rao | కేసీఆర్ నాయకత్వంలో వచ్చేది ప్రజా ప్రభుత్వం.. సిద్దిపేట గడ్డ నుంచే మరోసారి ఉద్యమ శంఖారావం: హరీశ్‌రావు
Horoscope | 12-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

