దహెగాం, ఫిబ్రవరి 23 : గల్లిగల్లీకి తిరిగి కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ఎండగడుదామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఆపై మండలకేంద్రంలో కార్యకర్తలతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు అడ్డగోలు హామీలిచ్చిందని, అధికారంలోకి వచ్చాక వాటిని అమ లు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఈ విషయాన్ని పల్లె పల్లెనా తిరిగి ప్రజలకు తెలియజేయాలని, వాడల్లో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి అర్థమయ్యేలా వివరించాలని కార్యకర్తలకు సూచించారు. అట్టడుగు వర్గాల యువత రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాల పాటు కొందరి చేతుల్లోనే రాజకీయాలు ఉంటున్నాయని, అధికారం ఏ పార్టీ చేతుల్లో ఉన్నా నడిపించేది మాత్రం యువతేనని చెప్పుకొచ్చారు.
ఆరే కులస్తులు ఆర్ఎస్పీని కలిసి తమ సమస్యను వివరించారు. తమకులం బీసీ-డీలో ఉందని, ఓబీసీ జాబితలో చేర్చేలా కృషి చేయాలని కోరారు. ఇందుకు ఆయన స్పందిస్తూ ఆరె కులస్తులకు ఓబీసీ సర్టిఫికెట్ కోసం కృషి చేస్తానన్నారు. ఆరె కులస్తుల ను ఓబీసీ జాబితాలో చేర్చేందకు కేంద్రంతో మాట్లాడుతానన్నా రు. ఈ విషయమై ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివాజీతో ఫోన్లో మాట్లాడారు. నియోజవర్గం ఇన్చార్జి లెవడుగురి శ్యాంరావు, నాయకులు సలీమ్, యువత అధ్యక్షులు కాశిపాక రాజు, శాకీర ఎల్కరి ప్రశాంత్, దందెర మల్లేశ్, రంగు సందీప్, చాపిడి సూరి, సంఘం మండల అధ్యక్షుడు నారాయణ, గ్రామ కమిటీ అధ్యక్షుడు చప్పిడ తిరుపతి పాల్గొన్నారు.