కోటపల్లి : రౌడీ షీటర్లు ( Rowdy sheeters ) సత్ప్రవర్తనతో మెలగాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్ ( CI Sudhakar ) హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్ స్టేషన్లో చెన్నూర్ రూరల్ సర్కిల్ పరిధిలోని కోటపల్లి, నీల్వాయి రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెదిలి మంచిపేరు తెచ్చుకోవాలని సూచించారు.
గ్రామాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనకూడదని సూచించారు. గ్రామాల్లో జరిగే ప్రతి విషయాన్ని పోలీస్ లకు తెలియజేయాలని పేర్కొన్నారు. చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలలో పాల్గొనకూడదని ఎటువంటి కేసుల్లోనైనా పాల్గొంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి, నీల్వాయి ఎస్సైలు రాజేందర్, శ్యామ్ పటేల్ పాల్గొన్నారు.