భీమిని, డిసెంబర్ 8 : భీమిని మండలంలోని ఆర్ఎంపీలు, పీఎంపీలకు ‘నమస్తే తెలంగాణ’ కథనంతో దడపుట్టింది. ఈ నెల 6న ‘ఆర్ఎంపీల ఆగడాలకు అడ్డేది’ శీర్షికన స్టోరీ ప్రచురించగా, అధికారులు తనిఖీలకు వస్తారేమోనని అప్రమత్తమయ్యారు. అదే రో జు అత్యవసరంగా సమావేశమై క్లినిక్ల వద్ద కుప్పలు తెప్పలుగా ఉన్న గ్లూకోజ్లు, సిరంజీలను మాయం చేశారు. మెడికల్ షాపు ల్లో చికిత్స కోసం వేసిన బెంచీలను తొలగించారు. మెడికల్షాపుల్లో ఉన్న యాంటీబయటిక్స్, స్టెరాయిడ్స్, శస్త్ర చికిత్సలకు సం బంధించిన పరికరాలన్నీ ఖాళీ చేశారు. వైద్యం చేసి వికటించిన బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి ఏ అధికారి వచ్చినా.. ఎలాంటి సమాచారమివ్వద్దని ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తున్నది.
ప్రధానంగా ఈజ్గాంకు చెందిన ఓ ఆర్ఎంపీ 20 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చి నిబంధనలు ఉల్లంఘించి వైద్యం చేస్తున్నాడన్న ఆరోపణలున్నాయి. చుట్టుపక్క ఉన్న గ్రామాలకు అంబులెన్స్ పంపించి, తన మెడికల్ షాపునకు రప్పించుకొని మరీ వైద్యమందిస్తున్నాడు. తన వద్ద వైద్యం పొందిన ఇద్దరి రోగుల ఫొటోలు ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితం కాగా, వారిని పిలిపించుకొని ఎలాంటి చికిత్స పొందలేదని చెప్పాలని వారిపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. అలాగే తనకు నాటు వైద్యం కూడా వస్తుందని చెప్పి ప్రజలను మోసం చే స్తుంటాడు. తన వద్దకు వచ్చే వారికి మంత్రాలు చేసిన నీళ్లతో తుడవడం, యంత్రాలు కట్టడం, వాగు వద్దకు తీసుకెళ్లి తింపి వేయడం వంటివి చేస్తుంటాడు. మాయమాటలు చెప్పి అందినంత దోచుకుంటున్నాడు.
తన మెడికల్ షాపులో ఇష్టారీతిన ఎంబీబీఎస్ డాక్టర్ మాదిరిగా శస్త్ర చికిత్సలు చేయడం, మత్తు ఇంజక్షన్లు ఇవ్వడం, మత్తు టాబ్లెట్లు అమ్మడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇటీవల రాజారాం గ్రామానికి చెందిన దుర్గం వెంకటేశ్ దవడ నొప్పితో రాగా, పన్ను తీసివేశాడు. దీంతో వైద్యం వికటించి, వాపు రావడంతో తనకు నచ్చిన ఇంజక్షన్లు ఇచ్చాడు. దీంతో కొద్ది రోజులకే చనిపోయాడు. అలాగే బిట్టూరుపల్లిలో యా టకారి రాజమ్మ చేయి నొస్తుందని ఈయన వద్ద కు రాగా, ఇంజక్షన్ వేయడంతో గడ్డలు అయి కొన్ని రోజులకే మృతిచెందింది. మామిడిపల్లి లో ఒకరి ఆవు కుప్పలో ఉన్న సిరంజీలను తి నడంతో మృతి చెందింది. ఇలా అనేక ఘటనలున్నాయి. కాగా, ఆదివారం కొందరు తి రిగి మెడికల్ షాపుల్లో బెంచీలు ఏర్పాటు చేసి వైద్యం అం దించడం కొసమెరుపు.
ప్రైవేట్ హాస్పిటళ్లతో కుమ్మక్కు
భీమిని మండలానికి చెందిన కొంద రు ఆర్ఎంపీ, పీఎంపీలు కాసుల కో సం కక్కుర్తి పడి మంచిర్యాలతోపా టు కరీంనగర్లోని కొన్ని ప్రైవేట్ హా స్పిటళ్లతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఆరోగ్య సమస్యలతో వచ్చే రోగులను అక్కడికి రెఫర్ చేస్తూ.. అక్కడ అందించే వైద్యా న్ని బట్టి కమీషన్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.