కౌటాల, ఆగస్టు 12 : ఆర్ఎంపీలు, పీఎంపీలు ఇక వైద్యం చేయడం ఆపేయాలని జిల్లా వైద్యాధికారి తుకారాం భట్ ఆదేశించారు. సోమవారం గుండాయిపేట గ్రామంలో డీపీవో భిక్షపతి గౌడ్, ఆర్డీవో సురేశ్‌బాబుతో కలిసి పర్యటించారు. ఆర్ఎంపీ, పీఎంపీల పనితీరుపై మండి పడ్డారు. స్థాయిని మరచి ఇష్టారీతిన ట్రీట్మెంట్ చేయడం, ఇంజెక్షన్లు, స్లైన్లు, పెయిన్కిల్లర్లు ఇవ్వడం మానుకోవాలన్నారు.
ఇంతటి ట్రీట్మెంట్ చేయాలంటే చదువు, పరిజ్ఞానం ఉండాలని, అనేక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. గుండాయిపేట గ్రామంలో క్లినిక్‌లు, ట్రీట్మెంట్లు ఆపేయాలని, తిరిగి చెప్పే దాకా ట్రీట్మెంట్ చేయడానికి వీల్లేదని ఆదేశించారు. మెడికల్ షాప్‌లను తనిఖీ చేశారు. రూరల్‌లో ఉండాల్సిన వాటికన్న స్టెరాయిడ్, హెవీ పెయిన్ కిల్లర్లు ఉన్నట్లు గుర్తించారు. ఆర్ఎంపీలు అందిస్తున్న చికిత్సను పరిశీలించారు. జీడీ ఆర్ఎంపీ క్లినిక్‌లో నాలుగు నెలల క్రితం కాలం చెల్లిన సిరప్‌లను గుర్తించారు.
ఆయుర్వేద, హోమియోపతి మందులను గుర్తించారు. వీటిని ఎవరిస్తారని అడిగితే.. అన్ని మందులు తానే ఇస్తానని ఆర్ఎంపీ చెప్పడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రెండు రోజుల క్రితం జ్వరంతో మృతి చెందిన జాడే పూజ, బోయర్ కాళీదాస్ కుటుంబాలను పరామర్శించి, కుటుంబీకుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
పంచాయతీ కార్యాలయం లో వైద్య శిబిరం ఏర్పాటు చేసి, జ్వరం, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారి రక్తపు నమూనాలను సేకరించారు. ప్రభుత్వ వైద్యాధికారులు, సిబ్బంది మెరుగైన వై ద్యం అందిస్తారని, ఆర్ఎంపీల వద్దకు పోయి ప్రా ణాల మీదకు తెచ్చుకోవద్దని గ్రామస్తులకు సూచించారు. పారిశుధ్య పనులు వేగవంతం చేయాలని డీపీవో సూచించారు. వైద్య, పంచాయతీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.