కడెం : పేద కుటుంబాలకు పౌష్టికాహారాన్ని అందించడానికే రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యాన్ని అందజేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ( MLA Velma Bojju Patel ) అన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కన్నాపూర్ గ్రామంలోని చౌక ధరల దుకాణం -1 లో తెల్ల రేషన్ కార్డు గల కుటుంబాలకు మంగళవారం సన్న బియ్యం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెల్ల రేషన్ కార్డు గల కుటుంబాలకు మంచి పౌష్టికమైన ఆహారాన్ని అందించాలనే సదుద్దేశంతో సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.