ఎదులాపురం, ఫిబ్రవరి 1 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులు, బుధవారం ఎస్పీ అధ్యక్షతన పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని అమరవీరుల స్తూపం వద్ద పుష్పాలు ఉంచి త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలో సుదీర్ఘకాలం పనిచేసి విరమణ పొందిన 25 మంది అధికారులకు ఎస్పీ అభినందనలు తెలిపి, సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజారక్షణ కోసం తీసుకున్న నిర్ణయాలు, సంఘ విద్రోహశక్తులతో పోరాడిన సంఘటనలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీనివాసరావు, బీ రాములునాయక్, సీ సమయ్‌జాన్‌రావు, ఆదిలాబాద్ డీఎస్పీ వీ ఉమేందర్, సీఐలు కే పురుషోత్తం, కే సత్యనారాయణ, ఆర్ఐ సీఐలు డీ వెంకటి, ఎం శ్రీపాల్, ఎస్ఐలు అన్వర్-ఉల్-హక్, జీ అప్పారావు, అశోక్ పాల్గొన్నారు.