ఆదిలాబాద్ : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. కేసీఆర్ పాలనతోనే అభివృద్ధి సాధ్యమని భావించిన ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని వాగ్ధారి, మాదాపూర్ గ్రాస్తులు ఏకతాటిపై నిలబడి మూకుమ్మడిగా బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లడుతూ.. గ్రామాల అభివృద్ధి కేవలం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ అభివృద్ధి చెసే పార్టీతోనే గ్రామాలు ముందుకు నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.