అంతర్గాం : కడెం ప్రాజెక్టు( Kadem Project ) వరద గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి విడుదల చేయడం వల్ల ఎల్లంపల్లి ప్రాజెక్టు (Yellampally Project) గేట్లు ఎత్తి నీళ్లు కిందకు వదిలే అవకాశం ఎల్లంపల్లి ప్రాజెక్టు ఏఈ బుచ్చిబాబు తెలిపారు. దీని దృష్ట్యా గోదావరి నది పరివాహక ప్రాంతంలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చేపలు పట్టేవారు, పశువులు, గొర్రెలు కాసేవారు రైతులు ప్రాజెక్టు సమీప ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని కోరారు.
కడెం నుంచి 22,520 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 47,941 క్యూసెక్కుల నీరు వస్తుంది. 12, 886 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్ధ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 15.9331 టీఎంసీల నీరు నిల్వ ఉంది.