కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి (కే) గ్రామంలో ఎరువుల కొరత రాకుండా (Fertilzers Shortage) అన్ని చర్యలు తీసుకోవాలని రైతులు శుక్రవారం ఆత్మ చైర్మన్ సిద్ధం వివేకానందకు (Siddam Vivekananda) వినతి పత్రం అందజేశారు. యూరియా, డీఏపీ ఎరువుల కొరత రానీయకుండా తగినన్ని ఎరువులను తెప్పించి సరఫరా చేయాలని కోరారు.
చైర్మన్ వివేకానంద మాట్లాడుతూ ఈపాటికే జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని కలిసి యూరియా కొరత రానివ్వద్దని ముందుచూపుతో అన్ని ఏర్పాట్లను చేయాలని సూచించినట్లు తెలిపారు. సకాలంలో మండలానికి యూరియా వచ్చేలా ఎప్పటికప్పుడు స్టాకును పరిశీలించాలని కోరినట్లు వివరించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, నాయకులు చైర్మన్‌ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బందెల సత్యనారాయణ, లంక సురేష్, సుంకరి రఘు, ఆకుల సుకుమార్, సంతక్క రాములు, న్యాకపు పెద్ద కిష్టయ్య, రైతులు పాల్గొన్నారు.