కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ ఏజన్సీ గ్రామంలో ఆక్రమణకు గురైన జీసీసీ భవనంతో పాటు ప్రభుత్వం భూమిని కాపాడాలని ( Save Land ) ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ భోజన్న, ఎంపీడీవో సత్యనారాయణ సింగ్ కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఏజన్సీ గ్రామమైన దేవాపూర్ పీసా చట్టం అమలులో ఉన్నప్పటికీ కొంత మంది గిరిజనేతరులు ఆదివాసీలకు కేటాయించిన భూమిని, జీసీసీ భవనాన్ని ఆక్రమించారన్నారు.
వెంటనే ప్రభుత్వ భూమిని, జీసీసీ భవనాన్ని కాపాడాలని, లేకుంటే ఆందోళన బాట పడుతామన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యాక్షులు ఆడె జంగు, జిల్లా గౌరవాధ్యక్షులు పెంద్రం హన్మంతు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మడావి అనంతరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కనక రాజు, సండ్ర భూమన్న, ఆత్రం జంగు, కుర్సింగ తిరుపతి, కనక గోవర్ధన్, పల్లె చంద్రయ్య, పెంద్రం ప్రభాకర్, సెడ్మాకి రాధ, ఆడె తిరుపతి, ఆడె శ్రీనివాస్, సిడం పాండు రంగ, లాందాస్ తదితరులు పాల్గొన్నారు.