బెజ్జూర్ : పోడు భూముల ( Podu lands ) సాగుదారులకు పట్టాలు అందించాలని కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా బీఆర్ఎస్ బెజ్జూరు మండల నాయకులు ఎఫ్ఆర్ఓకు ( FRO ) వినతిపత్రం అందజేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూముల సాగుదారులకు పట్టాలు అందించి ఆదుకుందని పేర్కొన్నారు. పోడు భూములపై సాగు చేస్తున్న గిరిజన, గిరిజనేతర రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, వారికి సాగు కొనసాగించే అవకాశం కల్పించాలని కోరారు. అటవీ శాఖ అధికారులు సానుకూలంగా స్పందించి, రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెజ్జూరు మండల నాయకులు, కార్యకర్తలు , ఆర్ఎస్పీ అభిమానులు పాల్గొన్నారు.