తాంసి : తాంసి మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ ( Congress) తాంసి మండల కన్వీనర్ కౌడాల సంతోష్ హైదరాబాదులో సోమవారం తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను (Mallu Batti Vikramarka ) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మత్తడివాగు డీ-1, డీ-2 కెనాల్ ల మరమ్మతు, ఇందిరమ్మ ఇళ్లు ( Indiramma Houses) , రోడ్ల సౌకర్యం, మండల అభివృద్ధికి సహకరించాలని కోరారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, తదితరాంశాలపై విక్రమార్కతో చర్చించినట్లు సంతోష్ పేర్కొన్నారు.