జై నూర్ : ఫ్రీ ప్రైమరీ కేంద్రాల ( Pre-primary Centers ) ఏర్పాటును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ అంగన్వాడీ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు గంగామణి డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలోని ఎంఈవో సుధాకర్ ( MEP Sudhakar ) కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం చేసిన ఫ్రీ ప్రైమరీ పీఎం శ్రీ కేంద్రాలను తక్షణమే రద్దు చేయాలని అన్నారు. ప్రీ ప్రైమరీ కేంద్రాలను రద్దుచేసి అంగన్వాడీలకు అప్పగించి, ఐసీడీఎస్ వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్ ను నిర్వీర్యం చేసినందుకే తెచ్చిన ఎన్వీపీ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని కోరారు. పెండింగ్ లో ఉన్న 11 నెలల ఏరియర్స్, మూడు నెలల పీఆర్సీ ఏరియర్స్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగులు తార జంగు, సుమలత, సంగీత, రేణుక, కమల,అనసూయ , శీల పాల్గొన్నారు .