కుభీర్ : గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ ( Mahatma Gandhi ) పేరు తొలగిస్తూ వీబీ జీ రాం జీ పేరు పెట్టడంపై కాంగ్రెస్ పార్టీ రైతు నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం స్థానిక పాత బస్టాండ్ లోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నిరసన( Protest ) తెలిపారు. పేదలకు పట్టెడు అన్నం పెట్టే పథకాన్ని నిరుపేద కూలీలకు అందని ద్రాక్షగా చేసేందుకు కేంద్రంలోని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని మోదీ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నినాదాలు చేశారు.
అనంతరం అక్కడి నుంచి తహసీల్ కార్యాలయం వరకు ఊరేగింపు నిర్వహించి తహసీల్దార్ శివరాజ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కందూరి సాయినాథ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గోనె కళ్యాణ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బషీరుద్దీన్, నాయకులు పానాజీ విజయ్ కుమార్, పురం శెట్టి రవికుమార్, బంక బాబు, జావీద్, దొంతుల బాలాజీ, ఆయా గ్రామాల సర్పంచులు, రైతు కూలీలు పాల్గొన్నారు.