Narnur | నార్నూర్, అక్టోబర్ 27 : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ ఉప మార్కెట్ యార్డులో వెదజల్లుతున్న దుర్వాసన అనే కథనం అక్టోబర్ 21 న ‘నమస్తేతెలంగాణ’ లో ప్రచురితమైంది. పంచాయతీ డివిజన్ అధికారి ప్రభాకర్, నార్నూర్ పంచాయతీ కార్యదర్శి మోతిరామ్ సోమవారం స్పందించారు. పంచాయతీ కార్మికులతో మార్కెట్ పరిసరాలలో పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రపరిచారు.
ఇంద్రవెల్లి మార్కెట్ యార్డ్ కార్యదర్శి శ్రీనివాసుని డీఎల్పీవో ప్రభాకర్ పోన్ లో సమాచారం తెలుసుకున్నారు. పిచ్చి మొక్కల తొలగింపును దగ్గరుండి చేయించారు. పలు విషయాలను జిల్లా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. ఈయన వెంట నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ జాదవ్ కైలాస్, నాయకులు మహమ్మద్ ఖురేషి తదితరులున్నారు.