వాంకిడి, నవంబర్ 3 : గిరిజన బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో బుధవారం 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వాంతులు, విరోచనాలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరుతున్న విద్యార్థినీల సంఖ్య రోజు రోజుకూ పెరు గుతున్నది. ఐదు రోజులు గడుస్తున్నా విద్యార్థుల ఆరోగ్యం కుదుట పడలేదు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో 13 మందిచ ఆసిఫాబా ద్ సరారు, ప్రైవేటు దవాఖానాల్లో 15 మంది, మంచిర్యాలలో నలుగురు చికిత్స పొందుతున్నారు. దీనికితోడు ఆదివారం మరో ఇద్దరిని రెఫర్ చేసిన్నట్లు తెలుస్తున్నది. విద్యార్థుల అనారోగ్యానికి గల కారణాలు, వారి ఆరోగ్య పరిస్థితులపై హాస్టల్ సిబ్బంది క్లారిటీ ఇవ్వకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పిల్లల ఆరోగ్యంపై హాస్టల్ సిబ్బంది ఒకొకరుగా ఒకో తీరుగా సమాధానం ఇస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మంచిర్యాలలోని మాక్స్ కేర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థిని శైలజ పరిస్థితి విషమంగా మారడంతో ఆమెను వెంటిలెటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మెరుగైన వైద్యం అందించాలి..
– ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి
మంచిర్యాల అర్బన్/వాంకిడి, నవంబర్ 3 : ఫుడ్ పాయిజన్ అయిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సూచించారు. గత నెల 31న వాంకిడి మండలంలోని గిరిజన బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో విద్యార్థినులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. వీరిని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆదివారం ఎమ్మెల్యే ఆసుపత్రికి వచ్చి విద్యార్థుల ఆరోగ్యం గురించి ఆరా తీశారు. వైద్యాధికారులతో మాట్లాడి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. ధైర్యంగా ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. ఇద్దరు విద్యార్థులకు మెరుగైన వైద్యం అవసరం ఉండడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించినట్లు తెలిసింది.
పలు కార్యక్రమాలకు హాజరు
రెబ్బెన, నవంబర్ 3 : రెబ్బెన మండలంలోని పలు కార్యక్రమాలకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి హాజరయ్యారు. గోలేటిలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు ఇంట్లో నిర్వహించిన సత్యనారాయణస్వామి వ్రతానికి, బీఆర్ఎస్ కార్యకర్త గణేశ్ కుమార్తె సారీ ఫంక్షన్‌కు, రెబ్బెన లో పీఏసీఎస్ డైరక్టర్ వెంకటేశ్వర్‌గౌడ్ తల్లి సంవత్సరీకానికి హాజరయ్యారు.