ఇంద్రవెల్లి : రాణి అహల్యబాయి హోల్కర్ను ( Rani Ahilyabai Holkar ) ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ మాజీ మండలాధ్యక్షులు ఆరెల్లి రాజలింగు అన్నారు. మండలంలోని పార్టీ కార్యాలయంలో శనివారం రాణి అహల్యబాయి హోల్కర్ 300వ జయంతి ( Birth Anniversary ) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం మహమ్మద్ గజిని( Mohammed Gajini) , గోరి, ఔరంగాజేబు, టిప్పుసుల్తాన్ ( Tippu sultan ) లాంటి క్రూరుల జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చించారని ఆరోపించారు. అహల్యబాయి హోల్కర్ జీవిత చరిత్ర ను మరిచి చరిత్ర హీనులుగా మిగిలిపోయారని మండి పడ్డారు.హోల్కర్ మహిళల హక్కుల కోసం అనేక పోరాటాలు చేశారని అన్నారు.
హిందువును జాగృతం చేసిన ఉక్కు మహిళగా అభివర్ణించారు. ఆమె జీవిత చరిత్రను గ్రామ గ్రామాన తెలిసేలా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా స్వచ్ఛభారత్ కన్వీనర్ దీపక్ సింగ్ షెకావత్, మండల ప్రధాన కార్యదర్శి కనక హనుమంతు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ దిలీప్ మోరే, మాజీ ఎంపీటీసీ కోవా రాజేశ్వర్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు రాథోడ్ రాధిక, బీజేవైఎం మండల అధ్యక్షుడు ముండే సాయి నందన్, మండల నాయకులు అనిల్, మెస్రం జైరాం, దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.