మంచిర్యాల అర్బన్, నవంబర్ 1 : నిబంధనలు ఉల్లంఘిస్తే ఇబ్బందులు తప్పవని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నారు. గురువారం కమిషనరేట్‌లో ఏఆర్, స్పెషల్ పార్టీ సిబ్బంది, హోంగార్డులతో నిర్వహించిన దర్బార్‌కు ఆయన హాజరై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏవైనా ఇబ్బందులుంటే నేరుగా తనను సంప్రదించవచ్చునని తెలిపారు. మంచిర్యాల, పెద్దపల్లిలో 494 మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.
రామగుండం కమిషనరేట్‌లో గురువారం జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు. సీపీ శ్రీనివాస్ సర్ధార్ వల్లబాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందితో దేశ సమగ్రతను కాపాడుతామని ప్రతిజ్ఞ చేయించారు.