సిర్పూర్ (యూ)/ లోకేశ్వరం : ముస్లిముల పవిత్రమైన రంజాన్ ( Ramzan) పండుగ వేడుకలను నిర్మల్(Nirmal), ఆసిఫాబాద్ ( Asifabad ) జిల్లాలో సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ) మండలంలో ముస్లిం సోదరులు ఈద్గా వద్దకు చేరుకుని ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎస్సై రామకృష్ణ రావు బందోబస్తును నిర్వహించారు.
లోకేశ్వరంలో..
మండలంలోని రాయపూర్ కాండ్లీ గ్రామంలో మండలానికి చెందిన నాయకులు మతాలకతీతంగా రంజాన్ వేడుకల్లో పాల్గొని మతసామరస్యాన్ని చాటారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ (BRS) మండల కన్వీనర్ కరిపే శ్యామ్ సుందర్ మాట్లాడుతూ సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని ఎటువంటి తారతమ్యాలు లేకుండా కలిసి ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ మండల కన్వీనర్ సుదర్శన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్ రావ్, నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ షఫీ, మండల కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ హర్ష ప్రసాద్, సురేష్, బండు పటేల్,కట్టెకోళ్ల దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.