Rain | ఖానాపూర్ : ఖానాపూర్ టౌన్ తో పాటు మండలంలోని పలు గ్రామాల్లో మోస్తారు వర్షం కురిసింది. వర్షంతో కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉంచిన వరి ధాన్యం తడిసింది. తడిసిన ధాన్యాన్ని కొనాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకాశంలో మబ్బులు తీవ్రంగా ఉండడంతో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.