నార్నూర్, ఏప్రిల్ 23 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఆదివారం సాయంత్రం గంటపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురియడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. నార్నూర్ మండలంలో రాళ్లవాన కురియడంతో పంటలు దెబ్బతిన్నాయి. సిర్పూర్(టీ) మండలంలోని వేంపల్లి గ్రామంలో పిడుగుపాటుకు ఎద్దు మృతిచెందింది. రహదారులపై చెట్లు విరిగిపడడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఇండ్ల పైకప్పులు లేచిపోగా.. విద్యుత్ స్తంభాలు నెలకొరుగడంతో కరెంటుకు అంతరాయం కలిగింది. వరి పైరు నెలకొరుగగా.. ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. చేతికచ్చే సమయంలో వడగండ్ల వానకు పంటలకు నష్టం వాటిల్లడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
మండలంలో ఈదురుగాలులతో పాటు వడగండ్ల వర్షం కురిసింది. దీంతో నార్నూర్‌లో ఓ చికెన్ షెడ్ కూలిపోయింది. కొత్తపల్లి(హెచ్)లో ఇండ్ల కప్పు రేకు లు ఎగిరిపోయాయి. నిత్యావసర సరుకులు తడిచిపోయాయి. పలుచోట్ల చెట్లు నెలకొరిగా యి. కొత్తపల్లిలో విద్యుత్ తీగలు తెగిపోయా యి. పలుచోట్ల జొన్న పంట దెబ్బతిన్నది. పం ట చేతికివచ్చే సమయంలో వర్షాలు పడుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బోథ్ మండలంలో ..
బోథ్, ఏప్రిల్ 23: మండలంలోని ఆదివారం భారీ వర్షం కురిసింది. కోసి కుప్పలుగా పెట్టిన మక్కలతో పాటు కోత దశకు చేరుకున్న జొన్న పంటకు నష్టం కలిగింది. పలుచోట్ల మామిడి కాయలు నేలరాలాయి. కన్గుట్ట, బోథ్, కౌఠ (బీ), పొచ్చెర శివారు ప్రాంతాల్లో అన్నదాత లు అవస్థలు పడ్డారు. మార్కెట్లో మక్క ధర పడిపోతున్నదని మద్దతు ధర క్వింటాలుకు రూ 1962 చెల్లించి కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇంద్రవెల్లి మండలంలో ..
ఇంద్రవెల్లి, ఏప్రిల్ 23 : మండలకేంద్రంతోపాటు పలు గ్రామాల్లో మక్కజొన్న, జొన్న పంటలు తడిపోయాయి. కాగా మండుతున్న ఎండల నుంచి కొంతమేర ఉపశమనం కలిగిందని ప్రజలు పేర్కొంటున్నారు.
సిర్పూర్(టీ) మండలంలో ..
సిర్పూర్(టీ), ఏప్రిల్ 23 : మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆదివారం సాయం త్రం గాలివాన బీభత్సం సృష్టించింది. వేంపల్లి గ్రామంలో చెట్లతో పాటు విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. సిర్పూర్(టీ)-కాగజ్‌నగర్ ప్రధాన ర హదారి వేంపల్లి, పెద్దబండ గ్రామాల మద్య భారీ చెట్లు నేలకొరిగాయి, దీంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా వేంపల్లి గ్రామానికి చెందిన మొర్లె నాగయ్యకు చెందిన ఎద్దుపై పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అదే గ్రామ స మీపంలోని విద్యుత్ స్తంభం ఎద్దు మీద పడడంతో తీవ్రగాయాలయ్యాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
బెల్లంపల్లిలో ..
బెల్లంపల్లిరూరల్, ఏప్రిల్ 23: బెల్లంపల్లి పట్టణంలో అరగంట పా టు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అరగంట జనజీవనం స్తంభించడంతో పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షం ఊరటనిచ్చినట్లయ్యింది.
పెంచికల్పేట్ మండలంలో..
పెంచికల్ పేట్,ఏప్రిల్ 23 : మండలంలో వ ర్షం, గాలి బీభత్సంతో పలు గ్రామాల్లో విద్యు త్ స్తంభాలు నేలకూలాయి. దీంతో సరఫరా లో అంతరాయం కలిగింది. చెట్లు రహదారులపై పడడంతో సర్పంచ్ లు, పారిశుధ్య కార్మికుల సాయంతో తొలగించా రు. మండలకేంద్రంలోని రహదారిపై చెట్లు ప డడంతో ఎస్ఐ విజయ్ కుమార్ జేసీబీతో తొ లగించి, రవాణాకు అంతరాయం కలగకుం డా చేశారు. ప లు గ్రామాల్లో ఇండ్లపైకప్పు రేకులు ఎగిరిపో గా, పూరి గుడిసెలు నేలమట్టమయ్యాయి. పొలాల్లోని వడ్లు నేల రాలిపోయాయి.
కెరమెరి మండలంలో ..
కెరమెరి, ఏప్రిల్ 23 : మండలంలో ఆదివారం సాయంత్రం గాలివాన భీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి తీవ్ర ఎండలతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారి ఉరుములు, మెరుపులతో కూడా వడగళ్ల వాన దంచి కొట్టింది. ఝరి గ్రామంలో పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ప్రధాన రహదారిపై ఉన్న విద్యుత్ స్తంభం ఇన్సులేటర్ పగిలి తీగలు వేలాడాయి. వెంటనే సంబంధిత శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
దహెగాం మండలంలో..
దహెగాం,ఏప్రిల్ 23 : మండలంలో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే పలు గ్రామాల్లోని ఇండ్లపై రేకులు ధ్వంసం కాగా, దహెగాం, ఐనం, కమ్మర్పల్లి, లగ్గాం, చౌక, ఒడ్డుగూడ తదితర పంచాయతీల్లో రాళ్లవానకు వరి పంట నేలకొరిగింది. అదేవిధంగా కల్లాల్లో ఆరబెట్టిన వడ్లు తడిసిపోయాయి. చేతికి వచ్చే సమయంలో పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దండేపల్లి మండలంలో ..
దండేపల్లి, ఏప్రిల్ 23 : మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ రాళ్ల వర్షం కురిసింది. తాళ్లపేట జాతీయ రహదారిపై భారీ వృక్షం కూలిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. ఏఎస్ఐ వెంకన్న అక్కడికి చేరుకొని సిబ్బంది సాయంతో చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
పిడుగు పడి ఎద్దు మృతి
లింగాపూర్, ఏప్రిల్ 23 : మండలంకేంద్రానికి చెందిన రాథోడ్ సాహెబ్ రావుకు చెందిన ఎద్దు ఆదివారం పిడుగుపాటుతో మృతి చెందింది. సాయంత్రం తన పొలం పనులు చేస్తుండగా ఒకసారిగా ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. పిడుగుపడడంతో ఎద్దు అకడికకడే మృతి చెందింది. తనను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరారు.