కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లంబాడీతండా(డీ) గ్రామ శివారులో శనివారం గుడుంబా స్థావరాల ( Gudumba centres) పై దేవాపూర్ ఎస్సై గంగారాం, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. గ్రామ శివారులో గుట్టు చప్పుడు కాకుండా గుడుంబా తయారు చేస్తున్నారని తెలుసుకొని ఆకస్మికంగా దాడులు చేశారు.
ఈ తనిఖీల్లో 1,500 వందల లీటర్ల బెల్లం పానకాన్ని , సామగ్రిని ధ్వంసం చేశారు. అనంతరం గ్రామస్తులతో ఎస్సై మాట్లాడుతూ గ్రామంలో గుడుంబా తయారు చేసినా, విక్రయించినా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంపై నిరంతరం నిఘా ఉంచుతామన్నారు.