ఆదిలాబాద్ : వానాకాలం పంటలను సాగు చేసే రైతులకు విత్తనాల డీలర్లు నాణ్యమైన విత్తనాలను ( Quality seeds ) పంపిణీ చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు విత్తనాల దుకాణంలో ఆయన అధికారులతో కలిసి తనిఖీ చేశారు. జిల్లాలో రైతులు పత్తి ,సోయాబీన్, కంది పంటలను ఎక్కువ సాగు చేస్తారని, సీజన్ ప్రారంభం నుంచి విత్తనాల పంపిణీ ప్రారంభించాలని పేర్కొన్నారు.
కల్తీ విత్తనాల విక్రయాలు జరగకుండా వ్యవసాయ శాఖ , పోలీస్ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. కల్తీ విత్తనాలు విక్రయించిన దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసు కేసులు నమోదు చేస్తామన్నారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు రసీదులను ( Receipts ) తమ వద్ద భద్రంగా ఉంచుకోవాలని సూచించారు.