నేరడిగొండ, జూన్ 12 : సర్కారు బడుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని, ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకోవాలని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ సూచించారు. బుధవారం వడూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు చదువులో రాణించి తల్లిదండ్రులు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులకు శాలువా కప్పి సన్మానించారు. ముందుగా పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంలు అందజేశారు. పాఠశాలలో ఇటీవల పూర్తయిన సింక్ నిర్మాణాన్ని ప్రారంభించారు. అనంతరం బడిబాటలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ ఏలేటి రవీందర్‌రెడ్డి, మండల విద్యాధికారి అన్రెడ్డి భూమరెడ్డి, నేరడిగొండ జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం పద్మ, నాయకులు దేవేందర్‌రెడ్డి, గాదె శంకర్, పాల శంకర్, నవీన్, రాములు, సురేందర్, ప్రతాప్‌సింగ్, మహిళ సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు వనజ, తహసీల్దార్ సంతోష్‌రెడ్డి, ఎంపీడీవో రాజ్వీర్, ఐకేపీ ఏపీయం ఉత్తం పాల్గొన్నారు.
ఇటీవల కొనుగోలు చేసిన జొన్నల డబ్బులను రైతులకు వెంటనే అందేలా చూడాలని కలెక్టర్ రాజర్షి షాను బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ కోరారు. బుధవారం జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. రైతులు జొన్నల డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే నియోజకవర్గంలో పలు సమస్యలను విన్నవించారు. పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఇందులో నాయకులు తిరుమల్ గౌడ్, గాడ్గె సుభాష్, పాండు, గంగయ్య, రమేశ్, రమాకాంత్ పాల్గొన్నారు.