బెల్లంపల్లి, డిసెంబర్ 30 : ప్రజల రక్షణ, భద్ర త పోలీసుల బాధ్యత అని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పేర్కొన్నారు. సోమవారం టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రడగంబాల బస్తీలో పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించా రు. ఇంటింటికీ సోదాలు నిర్వహించారు. అనుమానితుల గురించి ఆరా తీశారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 24 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలను సీజ్ చేశారు. అనంతరం బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ మాట్లాడు తూ యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. అనుమానితులెవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అం దించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ అఫ్జలుద్దీన్, టూటౌన్, తాళ్ల గురిజాల ఎస్ఐలు మహేందర్, రమేశ్, సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.