ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చింది. రెండు చోట్లా సభా ప్రాంగణం గులాబీమయమైంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రసంగం కొనసాగుతున్నంత సేపు ప్రజల్లో హుషారు మరింత పెరిగింది.
కేరింతలు, చప్పట్లు,సెల్ఫీలతో ఈ ప్రాంతం మురిసిపోయింది. ఇక అభ్యర్థులు జోగు రామన్న, అనిల్ జాదవ్ గెలుపు ఖాయమనే అభిప్రాయం వినిపించింది. జై బీఆర్ఎస్.. జైజైకేసీఆర్ అనే నినాదాలతో ఆ ప్రాంగణం మార్మోగింది.