నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం జీన్ గూడ కాలనీకి చెందిన వాగ్మా రే ఆనంద్ రావు అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి బానోత్ గజానంద్ నాయక్(Gajanand Nayak) బాధితుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అంత్యక్రియల నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ. 5వేల ఆర్థిక సాయం(Financial Assistance) అందజేశారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మాజీ మెంబర్ శాంతారావ్, అరవింద్, రవీందర్, సాంభాజి, దేవదాస్, రెహమాన్, బీమా మహారాజ్, ప్రకాష్ తదితరులున్నారు.