ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : ఆసిఫాబాద్ పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ఆవరణలో ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ ( Acharya Jayashankar ) 15వ వర్ధంతి వేడుకలను విశ్వబ్రాహ్మణ (విశ్వకర్మ) ఐక్య సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు భాస్కరాచారి, బట్టుపల్లి అశోక్ చారి, గౌరవ అధ్యక్షులు తుమోజు సురేష్ చారి, జిల్లా నాయకులు శ్రీమంతుల వేణుగోపాల్ చారి, రామోజు వెంకటయ్య చారి, రాధాకృష్ణ చారి, కస్తూరి రమేష్, గద్దెల పెళ్లి సంతోష్, తదితరులు పాల్గొన్నారు.