సోన్, మే 16 : రైతు సంక్షేమమే.. ధ్యేయంగా.. రైతు చెంతనే ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నది ప్రభుత్వం. యాసంగి ధాన్యం చేతికి అందుతున్న తరుణంలో దూరభారం, వ్యయప్రయాసాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. రైతుల ధాన్యం కల్లాల నుంచి కేంద్రాలకు తరలించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మద్దతు ధరను రైతులకు అందించేందుకు ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తున్నది. దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు పూర్తి భరోసానిస్తున్నాయి. ఇప్పటికే నిర్మల్, సోన్ మండలాల్లో పీఏసీఎస్, ఐకేపీ, ఎఫ్ఏసీఎస్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో 15కి పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొనుగోళ్లు ప్రారంభం కాగా రైతులు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి విక్రయిస్తు న్నారు.ప్రభుత్వం ఏ గ్రేడ్ రకానికి రూ. 2,060, బీ గ్రేడ్ రకానికి రూ. 2,040 మద్దతు ధర చెల్లిస్తున్నది.
దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే చి‘వరి’ ధాన్యం గింజ వరకు కొనుగోళ్లు చేపడుతుండటంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది. ధాన్యం తూకం పూర్తయిన ఒకటి, రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు లు జమ చేస్తున్నారు. దీంతో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ యాసంగిలో వరి ధాన్యం దిగుబడులు ఆశించిన స్థాయిలో ఉన్నాయి. ధాన్యం చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు కొంచెం ఇబ్బంది కలిగించినా రైతులు తగిన సమయంలో వరి కోతలు పూర్తి చేస్తుండడంతో గండం నుంచి గట్టెక్కినట్లయింది. ఒకవేళ అకాల వర్షాల వల్ల ధాన్యం గింజలు తడిసినా, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటూ తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేస్తామని హామీనివ్వడం రైతులకు మరింత ఆత్మైస్థెర్యం పెరిగింది.
తేమశాతం చూసుకొని రావాలి..
రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయిం చాలి. ధాన్యం తేమ శాతం చూసుకొని కొను గోలు కేంద్రానికి తీసుకు రావాలి. రైతులకు ఏ గ్రేడ్ రకానికి రూ. 2,060, బీ గ్రేడ్ రకానికి రూ. 2,040 మద్దతు ధర చెల్లిస్తున్నది సర్కారు. దీంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులెవరూ అధైర్య పడవద్దు. సీఎం కేసీఆర్ నిరంతరం రైతులకు అండగా నిలుస్తున్నారు.
– అంపోలి కృష్ణప్రసాద్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్(మంజులాపూర్)
రైతులకు ఎంతో ప్రయోజనం..
ప్రభుత్వం కొను గో లు ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేయడం రైతు లకు ఎంతో ప్రయోజన కరం. గతంలో 80 కిలో మీటర్ల దూరంలో ఉన్న నిజామాబాద్‌కు రైతు లందరం కలిసి వడ్లను తీసుకొని వెళ్లే వాళ్లం. పగటి పూట తినేందుకు ఇంటి నుంచి టిఫిన్ బాక్స్ కట్టుకొని వడ్లను అమ్ముకొని వచ్చేవాళ్లం. ధర ఎంత చెల్లిస్తే అంతే తీసుకొనే వాళ్లం. ప్రభుత్వం మా గ్రామంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు తీరాయి. దూరభారం, వ్యయ ప్రయాసాలతో పాటు సమయం ఆదా అవుతున్నది.
-కొప్పుల నర్సయ్య, రైతు, వెంగ్వాపేట్(నిర్మల్)
ఇబ్బందులు తీరాయి..
గతంలో పంట పండించడం ఒక ఎత్తు అయితే దాన్ని విక్ర యించడం మరో ఎత్తు గా ఉండేదని మా నాన్న చెప్పేవారు. పం డించిన పంటను దళా రులకే విక్రయించే రోజు లవి. నేను ఎనిమిదేళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నా. అప్పటి నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం విక్రయిస్తున్నాం. ఇబ్బందులేమి లేకుండా సాఫీగా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయిస్తున్నాం. సర్కారు రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నది. ప్రస్తుతం ఏ లేకుండా పంటలు పందిస్తున్నాం.
– సముందర్‌పెల్లి ప్రదీప్, రైతు(సోన్)