మక్క కొనుగోళ్లకు గన్నీ గ్రహణం
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా యాసంగిలో సాగు చేసిన మక్క కొనుగోళ్లు నిలిచిపోయాయి. 18 వేల ఎకరాల్లో మక్క సాగవగా.. 5.40 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్లు ప్రారంభించారు.
- సంచుల కొరత వేధిస్తుండడంతో యార్డుల్లో రైతుల పడిగాపులు
- ఒకవైపు మండుటెండ.. మరోవైపు వర్షం భయం..
- పంట ఉత్పత్తులు కొనుగోలు చేయాలని వేడుకుంటున్న రైతులు
ఆదిలాబాద్, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా యాసంగిలో సాగు చేసిన మక్క కొనుగోళ్లు నిలిచిపోయాయి. 18 వేల ఎకరాల్లో మక్క సాగవగా.. 5.40 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్లు ప్రారంభించారు. ఏడు కేంద్రాలు ఏర్పాటు చేసి పీఏసీఎస్ ద్వారా క్వింటాలుకు మద్దతు ధర రూ.2400తో కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకు రూ.1800 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు ప్రభుత్వం మార్కెట్ యార్డుల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలకు పంటను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.
నిలిచిన కొనుగోళ్లు
కొనుగోళ్లు ప్రారంభమైన వారం రోజులకే కొనుగోళ్లు నిలిచాయి. ఆదిలాబాద్, తాంసి మార్కెట్ యార్డుల్లో గన్నీ సంచులు లేకపోవడంతో కేంద్రాల నిర్వాహకులు పంటను సేకరించడం లేదు. మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన మక్కల వద్ద కాపలా ఉంటున్నారు. జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్ర తలు నమోదు కావడంతో మండుటెండలో మార్కెట్ యార్డుల్లో పడిగాపులు కాస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరతో పంటను కొనుగోలు చేస్తుండడంతో మార్క్‌ఫెడ్ కేంద్రాల్లోనే మద్దతు ధరతో అమ్ముకుందామనుకుంటున్న రైతులకు గన్నీ సంచుల కొరత సమస్యగా మారింది. అకాల వర్షాల కారణంగా పంట ఎప్పుడు తడిసిపోతుందని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి పంటను కొనుగోలు చేసి నష్టపోకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
గన్నీ సంచులు లేవని మకలు కొనలే..
తాంసి, ఏప్రిల్ 28 : మేము పగలు ఎండలో మకలు కోసి సోమవారం ట్రాక్టర్‌తో తాంసి మారెట్‌కు తీసుకొచ్చాం. కానీ.. ఇకడ గన్నీ సంచులు లేవంటూ మా మకలు కొనలేదు. రోజు మొత్తం ఎండలో నిలబడి అలసిపోయాం. రాత్రి అయిపోయేసరికి మొకలకు కావలి ఇకడే పడుకున్నాం. తినడానికి, తాగడానికి కూడా సరైన సౌకర్యం లేదు. మేము పంట పండిస్తే కొనేవాళ్లు ఉండాలి గానీ, ఇలా తిరసరిస్తే మా పరిస్థితి ఏంటీ? మా కష్టం ఎవరికీ కనిపించదు. గన్నీ సంచులు సిద్ధంగా పెట్టి వెంటనే మకలు కొనాలి. మమ్మల్ని ఇలా రాత్రంతా ఇబ్బందులు పడేలా చేయొద్దు.
– సల్ల భూమన్న, రైతు, తలమడుగు
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

