నార్నూర్ : దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు పీడియట్రిక్, టీబీ నివారణ వైద్యుడు జితేందర్ రెడ్డి( Dr. Jitender Reddy ) అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం బాబేఝరి గ్రామంలో ఎక్స్రే వైద్య శిబిరాన్ని ( Medical Camp ) నిర్వహించారు. క్షయ వ్యాధి, షుగర్, క్యాన్సర్, డయాలసిస్, హెచ్ఐవీ, పొగ, మద్యం సేవించి అనారోగ్యంతో బాధపడుతున్న రోగులను గుర్తించి ఎక్స్రేతోపాటు స్కానింగ్ చేశారు.
దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించి వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సుమలత, బాలసుబ్రమణ్య స్వామి, వైద్య సిబ్బంది చరణ్ దాస్, జాదవ్ సుదర్శన్, తిరుపతి, శ్రీనివాస్, హిమ బిందు, మాన్కు బాయి, ఈశ్వరి, నాందేవ్, అమృత్ రావ్, అంగన్వాడీ టీచర్ నీలాబాయి, ఆశా కార్యకర్తలు రమాదేవి, గంగుబాయి, ఎత్మాబాయి, రూపాబాయి పాల్గొన్నారు.