జైనూర్ : ఛలో అసెంబ్లీ ముట్టడికి బయలు దేరిన గిరిజన సంఘాల నాయకులను( Tribal Leaders ) పోలీసులు ముందస్తుగా ఎక్కడి వారిని అక్కడే అరెస్టు ( Arrest ) చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. బుధవారం గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా లంబాడా నాయకులు పవార్ పితా నాయక్‌ను జైనూర్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని, టాను నాయక్ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించాలని, గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేస్తోందని, గిరిజనులకు న్యాయం చేయకపోతే ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.అక్రమ అరెస్టుల ద్వారా ఉద్యమాలను ఆపలేరని వెల్లడించారు.