లక్షెట్టిపేట,సెప్టెంబర్ 22 : ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న హైదరాబాద్లో నిర్వహించే రేషన్ డీలర్ల భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మోటపల్కుల సత్తయ్య పిలుపునిచ్చారు.
ఆదివారం పట్టణంలోని విశ్రాంతి భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు జిల్లాలోని 426 మంది రేషన్ డీలర్లు తరలిరావాలన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రేషన్ డీలర్లకు రూ. 5 వేల వేతనం పెంచాలని, రూ. 300 కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి రాజన్న, డీలర్లు గంగారాజం, రామస్వామి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.