కెరమెరి, జనవరి 13 : ప్రకృతే ఆదివాసుల ఆరాధ్య దైవమని మంత్రి సీతక అన్నారు. సోమవారం కెరమెరి మండలంలోని కోట పరందోలి సహ్యాద్రి పర్వతాల్లో కొలువైన జంగుబాయి పుణ్యక్షేత్రాన్ని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎంపీ సోయం బా బురావు, జీసీసీ చైర్మన్ తిరుపతి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సకు, ఐటీడీఏ పీవో కుష్బూగుప్త, అదనపు కలెక్టర్ దీపక్ తి వారీతో కలసి దర్శించుకున్నారు. మంత్రి సీతక, కోవ లక్ష్మి, ఆత్రం సుగుణ సంప్రదాయ దుస్తులు ధరించి అమ్మవారి గుహలో ప్రత్యేక పూజలు చేశారు. రూ: 50 లక్షలతో జంగుబాయి క్షేత్రంలో మౌలిక వసతులు కల్పిస్తామని మం త్రి హామీ ఇచ్చారు. క్షేత్రానికి సంబంధించిన భూములకు పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేశ్, డీసీసీ ప్రెసిడెంట్ కొకిరాల విశ్వ ప్రసాద్ రావు, నాయకులు ఆత్రం లక్ష్మణ్‌రావ్, ఆత్రం సుగుణ, కుమ్రం భీంరావ్, శ్యాంరావ్, పుర్క బాపురావ్, కటోడాలు పాల్గొన్నారు.