ఆసిఫాబాద్ టౌన్,డిసెంబర్ 23 : ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిషరించేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు.
సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరెట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వరరావుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.