
లక్ష్మణచాంద, జనవరి 30 : ఆస్తి కోసం కట్టుకున్న భర్తనే హత్య చేయించిందో భార్య. మండలంలోని కనకాపూర్ గ్రామశివారులోని వాగులో శవాన్ని పడేసి వెళ్లగా, ఈ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు.నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి హత్య కేసు వివరాలను వెల్లడించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేట్‌కు చెందిన స్వప్నకు 12 ఏళ్ల వయసులో చిట్టాపూర్‌కు చెందిన కైలాస్పతి అనే వ్యక్తితో వివాహం కాగా, కుమారుడు రాజ్‌కుమార్ జన్మించాడు. రెండేళ్లకే మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. కుమారుడు రాజ్‌కుమార్‌ను కైలాస్పతి దగ్గరే పెరిగాడు. అనంతరం స్వప్న జీవనోపాధి కసం హైదరాబాద్‌కు వెళ్లింది. అక్కడ ఆటో డ్రైవర్ కంచికట్ల శ్రీనివాస్(42)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిం ది. 20 ఏళ్ల క్రితం వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారికి పిల్లలు తరుణ్(19), సిరివెన్నెల(15) ఉన్నా రు. ఈ క్రమంలో శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా సంపాదించాడు. అతనికి వేంపేట్తో పాటు హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఇండ్లు ఉన్నా యి. తొమ్మిదేళ్ల క్రితం నందిని అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం విష యం తెలుసుకున్న స్వప్న ఆత్మహత్యకు యత్నించిం ది. దీంతో శ్రీనివాస్ నందినికి కొంత కాలం దూరం గా ఉన్నాడు. కుటుంబ సభ్యుల కారణంగా నందిని దూరమైందని భావించిన శ్రీనివాస్ తరచూ భార్య, పిల్లలను వేధించాడు. రెండేళ్ల క్రితం ఉప్పల్‌లో ఇల్లుకొని నందినిని అందులో ఉంచాడు. నందిని ఉన్న ఇంటిని కూలగొట్టి దానిని డూప్లెక్స్గా మార్చి ఆమె పేరిట రిజిస్ట్రేషన్ చేస్తానని శ్రీనివాస్ భార్యకు చెప్పగా అభ్యంతరం చెప్పింది. ఆస్తి ఎక్కడ ఆమెకు రాసిస్తాడోనని అనుమానించిన స్వప్న భర్తను హత్య చేయడానికి నిర్ణయించుకుంది. ముందుగా ఆమె మొదటి భర్తకు జన్మించిన కుమారుడు రాజ్‌కుమార్, అతని స్నేహితుడు పోశెట్టి సహాయం కోరింది. వారు రూ. 5 లక్షలతో కిరాయి హంతకులను పిలిపించారు. ఈ నెల 22న వేంపేట్లోని నివాసంలో శ్రీనివాస్ రాత్రి సమయంలో మద్యం తాగి పడుకున్నాడు. కిరాయి హంతకులు బాణాల అనిల్, కంచర్ల మహావీర్, మ్యాతరి మధు, కొలనూరి సునీల్, పొన్నం శ్రీకాం త్, పూసల రాజేందర్ శ్రీనివాస్‌ను హత్యచేశారు. అనంతరం తమకు డబ్బులు ఇవ్వమని అడుగగా ప్రస్తుతం తనవద్ద డబ్బులు లేవని స్వప్న చెప్పింది. మృతుడిపై ఉన్న బంగారు గొలుసు, బ్రాస్లెట్, ఉంగరం తీసుకుని హంతకులు వెళ్లిపోయారు. శ్రీనివాస్ శవాన్ని పోశెట్టి, రాజ్‌కుమార్, చిక్కా కారులో మండలంలోని కనకాపూర్లోని శ్మశానవాటిక పక్కన పడేసి వెళ్లారు. పోలీసులు శనివారం కంచికట్ల స్వప్న, తరుణ్, గుజ్జారి రాజ్‌కుమార్, బానాల అనిల్, ద్యావతి పోశెట్టి, ద్యావతి ప్రవీణ్ కుమార్, మల్యాల విష్ణు, కంచర్ల మహవీర్, కలనూరి సునీల్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుల్లో మరో ముగ్గురు వెంకటేశ్, పూనం శ్రీకాంత్, పూసల రాజేందర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి కారు, టాటా మ్యాజిక్ వాహనం, రెండు బైక్‌లు, పది సెల్ఫోన్లు, 30 గ్రాముల బంగారు చైన్, 33 గ్రాముల బ్రాస్లెట్, 10 గ్రాముల బంగారు రింగు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ రాంనర్సింహారెడ్డి, లక్ష్మణచాంద ఎస్ఐ రాహుల్, మామడ, నిర్మల్ రూరల్ ఎస్‌లు, సోన్ సర్కిల్ సిబ్బందిని ఆయన అభినందించారు.