బెల్లంపల్లి : పట్టణంలోని వన్ టౌన్ పోలీస్టేషన్ పరిధిలో వివిధ ప్రాంతాలలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను (Mobile Phones ) బాధితులకు పోలీసులు అప్పగించారు. బుధవారం వన్ టౌన్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఏసీపీ రవికుమార్ ( ACP Ravikumar ) , వన్ టౌన్ ఎస్హెచ్వో దేవయ్య ( SHO Devaiah) బాధితులను స్టేషన్కు పిలిచి అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్నా, దొంగిలించబడినా వెంటనే సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. సంబంధిత వివరాలు ఆయా పోలీస్స్టేషన్లో నమోదు అవుతాయని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ కొనుగోలు చేసిన సమయంలో తప్పనిసరిగా సంబంధిత బిల్లులు, ఐఎంఈఐ నెంబర్లు భద్రపరుచుకోవాలన్నారు.
ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరాలు, ఇతర ఆర్థిక నేరాలు పెరిగిపోతున్నందున మొబైల్ ఫోన్ల పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నామని ఫిర్యాదు చేసిన వెంటనే ఫోన్ ట్రాకింగ్ చేసి అప్పగించిన ఏసీపీ, ఎస్ హెచ్ వో లకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.