కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని మార్లగొండ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం నందపహాడ్పై శుక్రవారం పోలీసులు ఆకస్మిక దాడులు( Police raids ) నిర్వహించారు. ఈ సందర్భంగా నిలువ ఉంచిన మహారాష్ట్ర మద్యం(దేశీదారు) పట్టుకున్నట్లు కుభీర్ ఎస్సై ఏ కృష్ణారెడ్డి తెలిపారు.
ఈ దాడుల్లో 171 దేశీదారు సీసాలు పట్టుకుని స్వాధీన పర్చుకున్నట్లు వివరించారు. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. ఎన్నికల కోడ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి మద్యం, నగదు స్టాక్ చేయరాదని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.