స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ట భద్రత
ఈవీఎంల భద్రత కోసం స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల పటిష్ట భద్రత, బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పెద్దపల్లి పార్లమెంట్ మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల ఈవీఎంల భద్రత కోసం హాజీపూర్ మండలం ముల్కల్ల ఐజా ఇంజినీరింగ్ కళాశాల, మంచిర్యాల స్ట్రాంగ్ రూంలను సందర్శించారు.
- రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్
మంచిర్యాల ఏసీసీ, మే 14 : ఈవీఎంల భద్రత కోసం స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల పటిష్ట భద్రత, బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పెద్దపల్లి పార్లమెంట్ మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల ఈవీఎంల భద్రత కోసం హాజీపూర్ మండలం ముల్కల్ల ఐజా ఇంజినీరింగ్ కళాశాల, మంచిర్యాల స్ట్రాంగ్ రూంలను సందర్శించారు. భద్రత ఏర్పాట్లను పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్ట్రాంగ్ రూంల దగ్గర 144 సెక్షన్‌తో పాటు మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు, ఆర్మ్డ్ రిజర్వ్, కేంద్ర బలగాలు స్ట్రాంగ్ రూంల వద్ద పహారా కాస్తున్నాయన్నారు. ప్రమాదాలకు, అవకాశం లేకుండా అగ్నిమాపక పరికరాలను సైతం అధికారులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఏసీపీ పర్యవేక్షణలో సీఐ, ఇద్దరు ఎస్ఐలతో పాటు సిబ్బందితో 24/7 విధులు నిర్వహిస్తారన్నారు. అనంతరం అధికారులకు పలు సూచనలు, ఆదేశాలను జారీ చేశారు. సీపీ వెంట మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, టాస్ ఫోర్స్ మల్లారెడ్డి, రామగుండం సీఐ అజయ్ బాబు, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్, మంచిర్యాల మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకట నర్సయ్య, ఎస్ఐలు ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

