నిర్లక్ష్యపు డ్రైవింగ్ వద్దు
నిర్లక్ష్యపు డ్రైవింగ్ సరికాదని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 50 మంది డ్రైవర్స్ (సిబ్బంది)కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
- రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్
మంచిర్యాల ఏసీసీ, మే 24 : నిర్లక్ష్యపు డ్రైవింగ్ సరికాదని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 50 మంది డ్రైవర్స్ (సిబ్బంది)కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ వాహనాలను ఎప్పటికప్పుడు కండిషన్లో ఉంచుకోవాలన్నారు.
రోడ్డు ప్రమాదాల వల్ల 1,69,000 మంది ప్రాణాలు కోల్పోయారని, 4 లక్షల మంది క్షతగాత్రులు అయ్యారని తెలిపారు. నిమిషానికో రోడ్డు ప్రమాదం జరుగుతుందన్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐ ఎంటీవో మధు, ఆర్ఐలు మల్లేశం, శ్రీనివాస్, రామగుండం ఎంవీఐ మధు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

