మంచిర్యాల అర్బన్, మార్చి 11 : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ ప్రమోద్ రావు తెలిపారు. ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.
కాగా, తోటి ఉపాధ్యాయురాలి పట్ల అసభ్యకరంగా వ్యవహరించినందుకుగాను ఇదే ప్రిన్సిపాల్‌పై ఈ నెల 6న రామకృష్ణపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.