మంచిర్యాల అర్బన్, జూలై 31: ‘ఇచ్ వన్ ప్లాన్ట్ వన్’ అనే నినాదంతో మొకలు నాటి సంరక్షించడం ప్రతి ఒకరి బాధ్యత అని రా మగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ తెలిపారు. బుధవారం వన మహోత్సవం కా ర్యక్రమంలో భాగంగా రామగుండంలోని కమిషనరేట్ ఆవరణలో సీపీ పోలీస్ అధికారులు, విద్యార్థులతో కలిసి మొకలు నాటా రు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ జీవరాశి మనుగడ, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతూల్యతను కాపాడడంలో మొ కలు ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలిపారు.
ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి
పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని పోలీస్ అధికారులు, సిబ్బందిని సీపీ శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం ఉదయం జైపూర్ పోలీస్‌స్టేషన్‌ను మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ వెంకటేశ్వర్‌తో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
స్టేషన్ పరిసరాలను పరిశీలించి, రికార్డులను పరిశీలించారు. బ్లూకోల్ట్స్, పెట్రోకార్ సిబ్బంది పనితీరు, 100 డయల్ ఫిర్యాదులు, కేసుల వివరాలను పరిశీలించారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో గ్రామాల్లో పల్లెనిద్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, గంజాయి, మత్తు పదార్థాల సరఫరాపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ సీఐ మోహన్, ఎస్ఐ శ్రీధర్, కానిస్టేబుళ్లు, సిబ్బంది ఉన్నారు.