తానూర్, జూలై 11: జన్యుపరమైన కారణాలలో పుట్టుకతో వచ్చే అంగవైకల్యం, మానసిక, శారీరక సమస్యలతో జన్మించిన దివ్యాంగ విద్యార్థులకు భవిత భరోసానిస్తోంది. శారీరక వైకల్యంతో బాధ ప డుతున్న వారికి సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ప్రతి మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో వారికి కల్పించిన సదుపాయాలతో తల్లిదండ్రుల చింత కొంత మేర తీరింది. మండల కేంద్రంలో నిర్వహిస్తున్న భవిత కేంద్రంలో 12 మంది ప్రత్యేకావసరాలు గల పిల్లలకు సేవలు అందిస్తున్నారు. ఈ కేంద్రం పాఠశాల సమయాల్లోనే ప్రతి రోజు ఉద యం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పనిచేస్తున్నది.
అందించే సేవలు..
భవిత కేంద్రంలో దివ్యాంగులకు, ప్రత్యేకావసరా ల పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇందు కోసం ప్రభుత్వం ప్రతి భవిత కేంద్రంలో ఇద్దరు ఐఈఆర్పీ (ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్)లను నియమించింది. ప్రత్యేక శిక్షణ పొందిన వీరు పి ల్లల మానసిక, శారీరక స్థితులను (ఐక్యూ లెవల్స్) బట్టి వారికి తగిన శిక్షణ ఇస్తారు. విద్యార్థులకు వా రి స్థితిగతులను బట్టి చదవడం, రాయడం, నడవడం, మాట్లాడడం, ఆటలాడుకోవడం, వివిధ వ స్తువులను ఉపయోగించడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, వంటి అవసరాలను గుర్తించే విధానాన్ని తెలియజేస్తారు.
రవాణా భత్యం..
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు నిత్యం భవిత కేంద్రానికి తీసుకరావడానికి తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండడానికి ప్రభుత్వం వారికి నెలకు రూ. 250 రవాణా భత్యా న్ని చెల్లిస్తోంది. దీ ని ద్వారా వీరు కేంద్రానికి రావడానికి రవాణా సౌకర్యాం కూడా కల్పించింది. వైకల్యం ఉన్న పిల్లల వెంట రావడానికి వారి తల్లిదండ్రులకు ఆదనంగా రూ.350 ఎస్కార్ట్ ఆలవె న్స్ కూడా చెల్లిస్తోంది. అన్ని సౌకర్యాలతో పాటు మధ్యాహ్న భోజనం కూడా వీరికి కల్పిస్తున్నారు.
ఉచితంగా చికిత్సలు..
శారీరక వైకల్యం ఉన్న పిల్లలకు ప్రతి మంగళ వా రం ఈ విద్యా కేంద్రంలో ఫిజియోథెరపీ చేస్తారు. ఇందు కోసం తానూర్లోని కేంద్రంలో వైద్యుడు శ్రీనివాస్ చికిత్స అందజేస్తారు. దీంతో పాటు వా రం రోజుల పాటు ఇంట్లో చేయించాల్సిన సాధనాలను వివరిస్తారు. ఈ విధానంతో చక్కని ఫలితా లు వస్తున్నాయి. వైకల్యం తీవ్రంగా ఉండి భవిత కేంద్రానికి రాలేని పిల్లల కోసం హోం బేస్డ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
సత్ఫలితాలు వస్తున్నయ్..
పిల్లలకు నిత్యం ఇ స్తున్న శిక్షణ ద్వారా స త్ఫలితాలు వస్తున్నా యి. వారిలో ఐక్యూ లెవల్ కూడా పెరుగుతున్నది. వారి వ్యక్తిగత అవసరాలను చె ప్పగలుగుతున్నారు. ముఖ్యంగా వారు భవితలో చేరడం ద్వారా మానసిక ఆ నందాన్ని పొందుతున్నారు.
-కే.భూమన్న, ఐఈఆర్పీ తానూర్
మానసికస్థితి మెరుగవుతుంది
భవిత కేంద్రాలు దివ్యాంగులకు వరంగా భావించవ చ్చు. ఫిజియోథెరపీ చికిత్స వల్ల పిల్లల్లో చాలా మార్పు కనిపిస్తోంది. నడవలేని పరిస్థితుల్లో ఉన్న వారు సైతం ప్రస్తుతం నడవగలుగుతున్నారు. భవిత కేంద్రాల ద్వారా ప్ర త్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మేలు కలుగుతుంది.
-డాక్టర్ శ్రీనివాస్, ఫిజియోథెరపిస్ట్
చాలా మార్పు కనిపిస్తుంది
మా అమ్మాయి అక్షర పుట్టినప్పటినుంచి దివ్యాంగురాలు. నడవలేని, అన్నం తినలేని స్థితిలో ఉండే. ఎప్పుడైతే భవిత కేం ద్రంలో ప్రతి మంగళవారం ని ర్వహించే ఫిజియోథెరపీకి తీసుకెళ్తున్నాం. దీంతో పాపలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు నడవగలుగుతున్నది. అన్నం కూడా తింటున్నది. అన్ని అర్థం చేసుకుంటున్నది.
-చిట్టేవాడ్ గంగాప్రసాద్, తానూర్